ఆటిజంపై నాట్స్‌ సదస్సు

23 Apr, 2022 12:48 IST|Sakshi

నార్త్‌ అమెరికా తెలుగు సోసైటీ (నాట్స్‌) ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని నాట్స్‌ బోర్డ్‌ చైర్‌ఉమన్‌ అరుణగంటి, ప్రెసిడెంట్‌ విజయ్‌ శేఖర్‌ అన్నెలు తెలిపారు. 2022 ఏప్రిల్‌ 30న మధ్యాహ్నాం 2:00 గంటలు (4:30 ఈఎస్‌టీ) ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, నిపుణులు ఆటిజంపై చర్చిస్తారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిరాజు, మీనాక్షి చింతపల్లి, రామ్‌ ప్రయాగ, శుభ బొలిశెట్టి, కాశినాథుని రాధ, పద్మజా యలమంచిలిలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు www.natsworld.org/autism-awareness-acceptance ఉపయోగించవచ్చు. ఫేస్‌బుక్‌లో కూడా లైవ్‌ ఇస్తామని నాట్స్‌ తెలిపింది.


 

మరిన్ని వార్తలు