రెసిడెంట్‌, వర్క్‌వీసా గడువు పొడిగించిన న్యూజిలాండ్‌

13 May, 2022 13:43 IST|Sakshi

న్యూజిలాండ్‌లో వర్క్‌ పర్మిట్‌ వీసా, రెసిడెంట్‌ వీసా మీద ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2022 మే 9 నుంచి డిసెంబరు 31 వరకు వర్క్‌ పర్మిట్‌ / రెసిడెంట్‌ వీసా ఉన్న వారికి ఎటువంటి రుసుము లేకుండానే ఆటోమేటిక్‌గా మరో ఆరు నెలల పాడు పొడిగింపు ఇచ్చింది. ఎవరికి ఎంత కాలం పొడిగింపు వచ్చిందనే అంశం మే 25న వీసా రికార్డుల్లోకి ఎంటరవుతుందని తెలిపింది. తాజా వీసా గడువు తెలుసుకోవాలంటే మే 25 తర్వాత చెక్‌ చేసుకోవచ్చని చెప్పింది.

మరిన్ని వార్తలు