నాట్స్ నూతన అధ్యక్షుడిగా నూతి బాపయ్య చౌదరి

31 May, 2022 20:54 IST|Sakshi

నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్

డాలస్ (టెక్సాస్‌):  అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, నూతన కార్యవర్గం 2022-24ను ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నూతి బాపయ్య చౌదరి (బాపుకి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. బాపు నూతి నాట్స్ చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో నాట్స్ బోర్డు అధ్యక్ష పదవికి బాపు నూతి వైపే మొగ్గు చూపింది. నాట్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. వారిలో భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, హరినాథ్ బుంగతావుల, మదన్ పాములపాటి, రమేశ్ బెల్లంలు ఉన్నారు. నాట్స్ కార్యదర్శిగా రంజిత్ చాగంటి, సంయుక్తి కార్యదర్శిగా జ్యోతి వనం, కార్యనిర్వహక కార్యదర్శి(మీడియా)గా మురళీ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్)  శ్రీనివాస్ గొండి, కోశాధికారిగా హేమంత్ కొల్లా, సంయుక్త కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. 

అభినందనలు
భాషే రమ్యం.. సేవే గమ్యం లక్ష్యంగా  ముందుకు సాగే నాట్స్‌లో నూతన  కార్యవర్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ బోర్డు ఛైర్మన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ బోర్డు తరఫున బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం.. నాట్స్ నూతన అధ్యక్షుడు బాపు నూతితో పాటు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

కార్యవర్గ సభ్యులు
నాట్స్ కార్యవర్గంలో దిలీప్ కుమార్ సూరపనేని నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్), శ్రీనివాస రావు భీమినేని నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్‌షిప్), వెంకట్ మంత్రి నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా), కవిత దొడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్‌మెంట్‌), రామ్ నరేష్ కొమ్మనబోయిన నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్‌లైన్‌ ఫండ్ రైజింగ్), రాజేష్ కాండ్రు నేషనల్ కోఆర్డినేటర్ (ప్రోగ్రామ్స్), కృష్ణ నిమ్మగడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్), సురేష్ బొల్లు నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్), శ్రీని చిలుకూరి జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ వెస్ట్ జోన్), గురుకిరణ్ దేసు జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ ఈస్ట్ జోన్), రామకృష్ణ బాలినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ సెంట్రల్ జోన్), ప్రసాద్ డీవీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ సెంట్రల్ జోన్), సూర్య గుత్తికొండ (ఇమ్మిగ్రేషన్ & లీగల్‌ వింగ్ ), లక్ష్మి బొజ్జ (విమెన్ వింగ్)లు ఉన్నారు.

చదవండి: డాలస్‌లో సందడిగా టీపాడ్‌ వనభోజనాలు

మరిన్ని వార్తలు