ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో ఎన్నారై అరెస్టు.. రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష

12 Nov, 2021 12:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌: మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ దిగ్గజం మెకిన్సే అండ్‌ కంపెనీలో పార్ట్‌నర్‌ అయిన పునీత్‌ దీక్షిత్‌ అనే ప్రవాస భారతీయుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల ఆరోపణలతో అమెరికాలో అరెస్టయ్యారు. ఆయన 4,50,000 డాలర్ల మేర అక్రమంగా లాభాలు ఆర్జించినట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభియోగాలు మోపింది. దీక్షిత్‌పై నమోదైన రెండు అభియోగాలు రుజువైతే ఒక్కో దానిలో 20 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

అభియోగాలు
మెకిన్సే క్లయింట్‌ అయిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌.. త్వరలో గ్రీన్‌స్కై అనే సంస్థను కొనుగోలు చేయబోతోందన్న ఇన్‌సైడ్‌ సమాచారాన్ని దీక్షిత్‌ దుర్వినియోగం చేశారు. కొనుగోలు ప్రకటన వెలువడ్డాక కొద్ది రోజుల్లో ముగిసిపోయే గ్రీన్‌ స్కై అవుట్‌ ఆఫ్‌ మనీ కాల్‌ ఆప్షన్లను చౌకగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత టేకోవర్‌ ప్రకటన వెలువడిన అనంతరం గ్రీన్‌స్కై షేర్ల ధరలు ఏకంగా 44 శాతం ఎగియడంతో, కాల్‌ ఆప్షన్లు భారీగా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో దీక్షిత్‌ వాటిని విక్రయించి, గణనీయంగా లాభపడ్డారని ఎస్‌ఈసీ అరోపిస్తోంది.   
 

మరిన్ని వార్తలు