వచ్చెనెల ఎన్నారై గ్లోబల్‌ మీట్‌.. ఎక్కడంటే?

23 Nov, 2021 13:29 IST|Sakshi

ప్రవాస భారతీయుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చే లక్ష్యంతో ఇండో అరబ్‌ కాన్ఫడరేషన్‌​ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. డిసెంబరు 4న కర్నాటకలోని బెంగళూరు వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్‌ ఎన్నారై మీట్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

వివిధ రాష్ట్రాల నుంచి
కేంద్రమంత్రి రామ్‌థాస్‌ అథవాలే, గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైలతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గతేడాది ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ గ్లోబల్‌ మీట్‌కి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 
ఎజెండా
- వివిధ దేశాల్లో వర్క్‌ పర్మిట్లు, వీసాలు పొందడంలో ఎన్నారైలు పడుతున్న ఇబ్బందులు
- స్వదేశానికి తిరిగొచ్చిన ఎన్నారైలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడం
- భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన
- ‍ క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉన్న  ఎన్నారైల సన్మాన కార్యక్రమం 
40 ఏళ్లుగా
1980లో కేరళలోని కోజికోడ్‌ కేంద్రంగా ఏర్పాటైన ఐఏసీసీ అసోసియేషన్‌.. 2014లో ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా మారింది. ఈ అసోసియేషన్‌కు భారత్‌లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు యూఎస్, యూకే, అరబ్‌ దేశాల్లో శాఖలున్నాయి. ఈ అసోసియేషన్‌ స్ఫూర్తితోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎన్నారై సంక్షేమ సంఘాలు పని చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు