సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా బోనాలు

17 Jul, 2022 16:27 IST|Sakshi

ఈ ఏడాది కోవిడ్  నిబంధలను సడలించడంతో సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. ఇక్కడి సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు లోబడి ఘనంగా బోనాలు సమర్పించారు. స్థానిక నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచం కరోనా కోరల నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు.

 వందల మంది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపులో బోనాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ  బోనాల పండుగను సింగపూర్‌కు ఆరేళ్ల  క్రితం పరిచయం చేయడం ద్వారా టీసీఎస్‌ఎస్‌(TCSS) పేరు చరిత్రలో నిలిచింది. అది సొసైటీకి దక్కిన అదృష్టంగా వారు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఏకైక తెలంగాణ సంస్థ, టీసిఎస్ఎస్ అని తెలిపారు.  ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్ రెడ్డి , గడప స్వాతి రమేశ్, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్,  దార అలేఖ్య ఉన్నారు. వీరితో పాటు ఫణి రోజా రమణి అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకువచ్చింది.

ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు. 
అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు, మై హోమ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల పై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు. 

మరిన్ని వార్తలు