ATA Convention : వాషింగ్టన్‌ డీసీ వేదికగా ఆటా వేడుకలు

28 Jul, 2021 10:46 IST|Sakshi

వాషిం‍గ్టన్‌ డీసీ: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ కన్వెన్షన్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో  నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్‌ డీసీలో ఉన్న హెర్న్‌డాన్‌ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 

మొదటిసారి
ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్‌ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్‌ ఏరియా తెలుగు సంఘం, కాట్స్‌ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

ఏర్పాట్ల పరిశీలన
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్‌ ఆధ్వర్యంలో 70 మందికి పైగా  ఆటా కార్యవర్గ, అడ్‌హాక్‌, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్‌ కమిటీలు కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్‌ ఈ  కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు.
 
12 వేల మంది
ఆటా కాన్ఫరెన్స్‌ యూత్‌ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు