14న చికాగోలో ఓయూ ఫౌండేషన్‌ డే

6 Jun, 2022 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్‌ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్‌ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు.

శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్‌ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్‌: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత)

మరిన్ని వార్తలు