Miami Airport Plane Crash 2022: క్షణాల్లో అంటుకున్న మంటలు, వీడియో వైరల్‌

22 Jun, 2022 12:57 IST|Sakshi

అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై  ఒక విమానం  భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్‌ ల్యాండింగ్ గేర్‌ పెయిలవ్వడంతో 126 మంది ప్రయాణిస్తున్న విమానం  అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి.  దీంతో ప్రయాణీకులు ప్రాణభయంతో వణికిపోయారు.

డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుండి వస్తున్న విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో  ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.  దీంతొ రన్‌వే నుండి పక్కకు జరిగిన  విమానం క్రేన్ టవర్, చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లటి రసాయన నురుగుతో మంటలను తక్షణమే అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో విపరీతంగా షేర్‌ అవుతోంది. 

విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు ఫ్లైట్‌లోని ప్రయాణికులు వణికిపోయారని ఎన్‌బీసీ-6 అధికారి ర్యాన్ నెల్సన్  తెలిపారు.  విమానం మెక్‌డొనెల్ డగ్లస్ MD-82 అని, ఘటనా స్థలానికి పరిశోధకుల బృందాన్ని పంపనున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్  తెలిపింది.  ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే మంటలకు కారణమని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కొన్ని విమానాలు రాకపోకలు ప్రభావితమైనాయి. 

మరిన్ని వార్తలు