Rishi Sunak: రిషి సునాక్‌ ‘తప్పు’: ఆడేసుకుంటున్న నెటిజన్లు, ఏం జరిగిందంటే

16 Jul, 2022 15:11 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో దూసుకుపోతున్న  బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోషల్‌ మీడియాలోసంచలనంగా మారారు. అయితే రాజకీయంగా  తన ప్రతిభను చాటుకోబోతున్నందుకు కాదు.. సోషల్‌ మీడియా పోస్ట్‌లో తప్పులో కాలేసిందుకు. అయితే ఈ సెటైర్లకు, విమర్శలకు కూల్‌గా  సమాధానమిచ్చారు.

ప్రధాని పదవికి సంబంధించిన పోటీ రెండో రౌండ్‌లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్‌లో ఉన్న రిషి తన ప్రచార బ్యానర్‌లో స్పెల్లింగ్‌ తప్పుగా రాయడంతో నెటిజన్లు  సునాక్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తన మొదటి టెలివిజన్ డిబేట్‌ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ట్విటర్లో ‘క్యాంపెయిన్‌’ స్పెల్లింగ్‌ను తప్పుగా రాయడంతో ఆయన నెటిజన్లుకు దొరికియారు.  పలు కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.

ఫలితంగా గూగుల్‌ ట్రెండింగ్‌లో కూడా సునాక్‌ పేరు నిలిచింది. అవ్వడానికి బిలియనీర్‌..కానీ క్యాంపెయిన్‌ అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయారని ఒక యూజర్‌ కమెంట్‌ చేశారు. మరోవైపు వీటిపి రిషి సునాక్‌ స్పందించారు..తన స్లోగన్‌ రడీ ఫర్‌ రిషిలా...రడీ ఫర్‌స్పెల్ చెక్  అంటూ హుందాగా సమాధామిచ్చారు. కాగా బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వి కోసం రిషి సునాక్‌, పెన్నీ మార్డౌట్‌తో సహా మ‌రో ఐదుగురి మ‌ధ్య పోటీ సాగుతోంది. 

మొదటి రౌండ్‌లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించి, రెండో రౌండ్‌లో మూడు అంకెలకు పైగా సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ప్రచారంలో భాగంగా మిగిలిన ప్రత్యర్థులు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టోరీ బ్యాక్ బెంచర్ టామ్ తుగెన్‌ధాట్‌లతో వారాంతపు టెలివిజన్  డిబేట్లలో పాల్గొననున్నారు రిషి.

మరిన్ని వార్తలు