వీసాల జారీ.. రష్యా కీలక నిర్ణయం!

6 Mar, 2023 13:04 IST|Sakshi

రష్యా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. భారత్‌తో పాటు మరో 5 దేశాలకు చెందిన అర్హులైన పౌరులకు వీసాలను తక్షణమే జారీ చేసేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. తద్వారా వీసాల మంజూరులో కాలయాపన జరగదని, త్వరగా వీసా పొందే వీలుకలుగుతుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఇగోర్ ఇవానోవ్ (Igor Ivanov) రష్యా న్యూస్‌ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్‌తో అన్నారు. 

వీసా జారీ చేసే విధానాల విషయంలో రష్యా ప్రభుత్వం భారత్‌తో పాటు అంగోలా, వియత్నాం, ఇండోనేషియా, సిరియా, ఫిలిప్పీన్స్‌లతో కలిసి పని చేస్తోంది" అని ఇవనోవ్ చెప్పారు.

ఇంతకుముందు, రష్యా వీసా- ఫ్రీ ట్రిప్స్‌ కోసం సౌదీ అరేబియా, బార్బడోస్, హైతీ, జాంబియా, కువైట్, మలేషియా, మెక్సికో, ట్రినిడాడ్‌తో సహా 11 దేశాలతో వీసా రహిత పర్యటనలపై రష్యా అంతర్ ప్రభుత్వ ఒప్పందాలను కూడా సిద్ధం చేస్తోందని ఇవనోవ్ చెప్పారంటూ టీఏఎస్‌ఎస్‌ నివేదించింది.
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు