'వీధి అరుగు'లో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు

15 Jul, 2021 11:51 IST|Sakshi

ఆన్‌ లైన్‌ వేదికపై ఈనెల 25న 'వీధి అరుగు' ప్రత్యేక కార్యక్రమాన‍్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భారతీయ వైద్య రంగం - శాంతా రంగంలో తమ అనుభావాల్ని పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. జి.వి. పూర్ణచంద్ విశిష్ట అతిథిగా పాల్గొనున్నారు.

స్వదేశీ పరిజ్ఞానముతో భారతదేశంలో బయోఫార్మారంగం ఎలా అభివృద్ధి చెందింది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరియు టెక్నోక్రాట్లకు ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఆధునిక జీవితంలో మన ఆయుర్వేదం పాత్ర ఏమిటి? మానవుడు దైనందిక జీవితంలో ఎటువంటి కట్టుబాట్లు-నియమాలను పాటించాలి. కరోనా సంహారంకు ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తారని నిర్వహాకులు వెల్లడించారు.  

ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు.నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ లో నివసిస్తున్న  గాయకుడు కార్తీక్ మద్దెల పాటతో కార్యక్రమం ప్రారంభం కానుంది

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు