సింగపూర్ పూరమ్ ఉత్సవాల్లో బతుకమ్మ ఆట

28 May, 2023 15:19 IST|Sakshi

సింగపూర్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళ త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు ప్రేరణగా  సింగపూర్‌లోని 'గార్డెన్స్ బై ది బే' లోని 'ది మీడోస్' లో ఆదివారం (28 మే) 'సింగపూర్ పూరమ్' పేరిట సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. 2019 నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం లేదు.  కోవిడ్ నిబంధనలు తొలగించిన అనంతరం  ఈ ఏడాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.  సింగపూర్ లో నివసిస్తున్న వివిధ  భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు. 

ఇందులో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) మహిళా విభాగం ఈ  అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గుండె చప్పుడు బతుకమ్మ  ఆట పాటలను ప్రదర్శించారు. ప్రపంచంలో అందరూ పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే  తెలంగాణ ప్రత్యేక సంప్రదాయానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన సింగపూర్ పూరమ్ 2023 కార్యవర్గ సభ్యులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ఆటను ప్రదర్శించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనితా రెడ్డి, జూలూరి పద్మజ, రాధికా రాణి నల్ల, దీప నల్లా, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, సృజన వెంగళ, బొందుగుల ఉమా రాణి, సౌజన్య మాదారపు, గర్రెపల్లి కస్తూరి, కల్వ కవిత, రోహిణి గజ్జల, స్వప్న కైలాసపు, కీర్తి ముగ్దసాని, నాగుబండి శ్రీలత, మంచికంటి స్వప్న, బవిరిశెట్టి కృష్ణ చైతన్య, మడిచెట్టి సరిత, సుజాత తరిగొండ, శిల్ప రాజేష్ తదితరులు ఉన్నారు. 

పూరమ్ నిర్వాహకులు మాట్లాడుతూ  ఈ సాంస్కృతిక పండుగలో పాల్గొని ఈ కొత్త సంప్రదాయాన్ని తోటి ప్రవాస భారతీయులతో పాటు, సింగపూర్ స్థానికులకు పరిచయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి సింగపూర్ దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధి శాఖలకు ద్వితీయ మంత్రిగా సేవలందిస్తున్న భారతీయ మూలాలున్న ఇంద్రాణి రాజా పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, కళాకారులను అభినందించారు.

మరిన్ని వార్తలు