సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

26 Jan, 2021 15:52 IST|Sakshi

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే  సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో జనవరి 24న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్‌ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారు స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. గతేడాది జూలై 11, అక్టోబర్‌ 11లలో కోవిడ్‌ నిబంధనల్లోనూ ప్రతిసారీ కనీసం 100 మందికిపైగా రక్తదానం చేసి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేసిన సంగతి విదితమే.

అయితే ఈసారి ఈ కార్యక్రమానికి యువతతోపాటు కొత్తగా మరో 25 మంది నుంచి అత్యద్భుత స్పందన వచ్చింది. అత్యధిక సంఖ్యలో రక్తదానం కోసం నమోదు చేసుకోగా 125 మంది హాజరై రక్తదానం చేశారు. రక్తదానం చేయలనుకున్నన ఇతరదాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చని నిర్వాహకులు మేరువ కాశయ్య విజ్ఞప్తి చేశారు. తదుపరి రక్తదాన కార్యక్రమాన్ని మే డే సందర్భంగా నిర్వహించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి బ్లడ్ బ్యాంక్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ 19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు