గానకోకిల పాటకు పట్టాభిషేకం

25 Nov, 2021 14:33 IST|Sakshi

పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పీ సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఓమాన్, ఖతార్, బహరేయిన్, మలేషియా మరియు స్వీడన్ దేశాల నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేశారు. 

ఈ కార్యక్రమాన్ని వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, అనిల్ కుమార్, డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాధిక నోరి, లక్ష్మీ శ్రీనివాస రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు