కేసీఆర్‌ పాలన నేటి, రేపటి తరానికి వరం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

4 Sep, 2022 16:06 IST|Sakshi

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి విక్టోరియా ఇంఛార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఇక, మంత్రి నిరంజన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, పేదలు రెండు కళ్లుగా భావిస్తూ సీఎం కేసీఆర్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్‌. దేశంలో కేసీఆర్‌ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు.. నిరంజన్ రెడ్డి
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. 

తెలంగాణలో ప్రస్తుతం కరెంట్‌ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని అన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. దేశంలో మత రాజకీయంతో విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. 

బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు, అన్ని మతాల ప్రజలు సర్వతోముఖభివృద్ధి తో సంతోషంగా ఉన్నారని , నేటి కేసీఆర్ పథకాలు, సంస్కరణలు ప్రస్తుత, రేపటి తరాలకు వరం అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ , జై తెలంగాణ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సభ్యులు విశ్వామిత్ర, సతీష్, వినయ్ సన్నీ, ప్రవీణ్  లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయి యాదవ్, వేణు నాన, రాకేష్ , సాయి గుప్తా, సందీప్ నాయక్, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు