బహు భాషా కోవిదురాలు రమ్యకృష్ణ గోవర్ధన్‌పై ప్రశంసల వర్షం

18 Oct, 2022 15:51 IST|Sakshi

హైదరాబాద్‌ బాలిక రమ్యకృష్ణ గోవర్ధన్‌పై తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. దశాబ్దకాలంగా తెలంగాణ, దక్షిణ కొరియా భాష, సంస్కృతి, సంగీత, చలనచిత్రాల అభ్యున్నతి  కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి విద్యార్థిగా ‘తూర్పు ఆసియా - కొరియన్ భాష, సాహిత్య, చరిత్ర అధ్యయనం’ చేసేందుకు అమెరికాకు చెందిన ఆరు యూనివర్సిటీలు రమ్యకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ముందుకు వచ్చాయి. 

రమ్యకష్ణ ప్రతిభాపాటవాలపై మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఆమె 11 సంవత్సరాల వయస్సు నుండి కొరియన్ భాషను అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించారని చెప్పారు. 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌లో ‘హైదరాబాద్ కెపాపర్స్’ పేరుతో భారత- తెలంగాణ- కొరియా సాంస్కృతిక సంస్థను స్దాపించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ - భారత- కొరియా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిన ఆమె బహు భాష కోవిదురాలని అన్నారు. చైనీస్, జాపనీస్, ఫ్రెంచ్  భాషలలో ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. 

ప్రభుత్వ ప్రోత్సాహం మరువ లేనిది
తెలంగాణలో కొరియన్ భాష, సంస్కృతి, కళల ప్రోత్సాహానికి మామిడి హరికృష్ణ అండగా నిలిచారని రమ్యకృష్ణ చెప్పారు. తనకు తోడ్పాటు అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు