సింగ‌పూర్ విద్యార్ధుల‌కు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నృత్య కోర్సులు

26 Feb, 2022 21:32 IST|Sakshi

శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం (మహిళా విశ్వవిద్యాలయం) విద్య సంగీతం అకాడమీ (సింగపూర్) లు సంయుక్తంగా సింగ‌పూర్ విద్యార్ధుల‌కు నృత్య కోర్సులను అందిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.  

వైస్ ఛాన్సలర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ) అధ్యక్షతన, ఎస్పీఎంవీవీ అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన యూనివ‌ర్సిటీ అధికారులు, సింగపూర్లోని తెలుగు, భారతీయ సంగీత ప్రియులు రాగవిహారి పేరుతో విద్యార్థుల ప్రదర్శనల‌ కార్యక్రమం ఘనంగా నిర్వ‌హించారు. 2గంట‌ల పాటు నిర్వ‌హించిన ఈ కార్యక్రమాన్ని భార‌త్‌, సింగపూర్ సంగీత ఔత్సాహికులు యూట్యూబ్‌, సోష‌ల్ మీడియాలో వీక్షించారు.  


 
ఈ కార్యక్రమంలో భాగంగా ప‌ద్మావ‌తి యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున దువ్వూరు మాట్లాడుతూ..మ‌హిళా యూనివ‌ర్సిటీ త‌రుపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం గురించి మాట్లాడుతూ..ఎస్పీ ఎంవీవీ  ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ పి విజయలక్ష్మి, ఎస్పీఎం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ద్వారం వీజేలక్ష్మి ఈ కొలాబరేషన్ ప్రత్యేకమైన సింగపూర్ శైలిలో జరుగుతోందని, దీన్ని వ్యాప్తి చేసేందుకు విద్యా సంగీతం అకాడమీకి వారి సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. .


 
ఈ కార్యక్రమంలో విద్యా సంగీతం అకాడమీ (వీఎస్ఏ) వ్యవస్థాపకురాలు, శ్రీమతి కాపవరపు విద్యాధరి మాట్లాడుతూ, “పలు సంగీత నృత్య కార్యక్రమాలను అందించడానికి సుప్రసిద్ధ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పీ ఎంవీవీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సంగీతం (గాత్రం / వాయిద్యం) మరియు నృత్యం (కూచిపూడి / భరతనాట్యం) అలాగే అన్నమయ్య కీర్తనలు మరియు వాగ్గేయకార వైభవం కోసం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ లో పిల్లలకు అందిస్తాము. సింగపూర్‌లో మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు వీఎస్ఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. ఎస్ఫీ ఎంవీవీ  అధికారులు వారి మద్దతు, సౌలభ్యం మరియు అనేక నెలలపాటు పని చేయడం ద్వారా దీనికి రూపకల్పన చేసినందుకు నేను వారిని అభినందించారు.  


 
ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, చిరకాల సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.   శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రెసిడెంట్ రత్నకుమార్ కవుటూరు  ఎస్పీ ఎం వీవీ , వీఎస్ఏ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ సహకారాన్ని "సింగపూర్‌లోని ఎన్ఆర్ఐ విద్యార్థులు సంగీతం నేర్చుకునేందుకు, ఎస్పీ ఎంవీవీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు పొందేందుకు ఒక గొప్ప అవకాశం" అని అభివర్ణించారు.  

మన సంస్కృతి, సంగీతం యొక్క ప్రభావాలను యోగాతో పోల్చుతూ, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతేశ్వర్ రెడ్డి కురిచేటి ఈ సహకారాన్ని సంగీతాన్ని ఇష్టపడే పిల్లలందరూ ఆదరించడానికి ఒక ముఖ్యమైన, సంతోషకరమ‌ని పేర్కొన్నారు.భారతదేశం నుండి ప్రముఖ వక్త, రంగస్వామి కృష్ణన్  ఇలాంటి సహకారాలు మన దైనందిన జీవితంలో పెరగాలని, సంస్కృతిని వ్యక్తపరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బు వి పాలకుర్తి కూడా నిర్వాహకుల కృషిని అభినందించారు.
 
విద్యా సంగీతం అకాడమీ విద్యార్థుల ప్రకటనలు, సందేశాలు, ప్రదర్శనలతో ఒక ప్రత్యేకమైన మిక్స్‌గా  జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులచే ప్రశంసించబడింది. సింగపూర్‌లోని విద్యార్థుల కోసం ఎన్‌రోల్‌మెంట్‌లు తెరిచామని  వీఎస్ఏ టీం  ధృవీకరించింది. కోర్సు వివరాల,రిజిస్ట్రేషన్‌ల కోసం ఆసక్తిగల అభ్యర్థులు vidyasangeetam.academy ద్వారా సంప్రదించాల‌ని వీఎస్ఏ  ప్రతినిధి విద్యాధరి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు