లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కల్యాణం

13 Apr, 2022 12:49 IST|Sakshi

లాస్ ఏంజిల్స్‌లో  సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్‌ఏంజెసెల్‌ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్‌ఏంజెలెస్‌ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. 

భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా పెళ్లి జరిగింది. అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్‌ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్‌, ఏ మనోహార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. 


 

మరిన్ని వార్తలు