సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ సంక్రాంతి సంబరాలు

16 Jan, 2021 19:16 IST|Sakshi

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు సంక్రాంతి సంబరాలను జూమ్ ద్వారా శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సొసైటీ సభ్యులు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. పతంగి తయారీ, బొబ్బెమ్మల తయారీతో పాటు, చిత్ర లేఖనం, పాటలు, నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేశారు.  సంబరాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు  ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులచే ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ను విడుదల చేశారు. పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల  ప్రాముఖ్యతని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబరాలను ఆన్లైన్లో వేలాది మంది వీక్షించారు.

సంబరాలు విజయవంతంగా జరగటానికి సహయం అందించిన దాతలకు, స్పాన్సర్స్కు, ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మొదలగువారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, కల్వ లక్ష్మణ్ రాజు,  ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, సహవ్యాఖ్యాతగా సంతోషి కూర వ్యవరించారు. ఈ సందర్భంగా సొసైటీ  సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త  నల్ల, మిర్యాల సునీత రెడ్డి,  ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి  వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు  నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ సంబరాల్లో పాల్గొన్న  వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు