డల్లాస్‌: మద్యం మత్తులో కొట్టుకున్న బాలయ్య-పీకే ఫ్యాన్స్‌

2 Jan, 2023 10:24 IST|Sakshi
చంద్రబాబుతో కేసీ చేకూరి(ఫైల్‌ ఫొటో)

పవన్ అభిమానుల మీదకి  దూసుకెళ్లిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ ముఖ్యుడు కేసీ చేకూరి

జై పవన్‌ అంటూ తిరగబడిన పవన్‌ అభిమానులు

సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గరకొచ్చిన పవన్ అంటూ టీడీపీ సభ్యులు హేళన

చిరంజీవి , పవన్ పోస్టర్లు చించివేత

రంగంలోకి దిగిన అమెరికన్ పోలీసులు

కేసీ చేకూరిని అరెస్ట్‌ చేసిన డల్లాస్‌ పోలీసులు

బెయిల్‌ కోసం తానా పెద్దల యత్నం

డల్లాస్‌: ఫ్యాన్స్‌ వార్‌లో.. ఒక్కోసారి అభిమానులు విపరీతాల దాకా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ,  కొందరు తారలు మాత్రం అభిమానుల్ని వద్దని వారించరెందుకో?. రాజకీయం కోసం ఒక్కటవ్వడం తెలిసిన వాళ్లు.. ఫ్యాన్స్‌కు మాత్రం నాలుగు మంచి మాటలు చెప్పడం చేయకపోగా.. ఆ తారలే అభిమానుల్ని పూచీక పుల్లలాగా తీసేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం!. అయినప్పటికీ అభిమానం పేరిట హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అభిమానులు.  

టీడీపీ, జనసేన అభిమానులు కొందరు టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ నగరంలో రచ్చకెక్కారు. డిసెంబర్ 31 రాత్రి కొత్త సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డల్లాస్‌లో ఓ మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్న టీడీపీ ఎన్నారై కీలక సభ్యుడు కేసీ చేకూరి మద్యం మత్తులో.. ‘జై బాలయ్య’ అంటూ అక్కడే ఉన్న పవన్‌ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు.  ప్రతిగా ‘జై పవన్’ అంటూ నినాదాలు చేశారు పీకే ఫ్యాన్స్‌. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. 

‘అలగాజనం అంటూ తిట్టినా సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గరకొచ్చిన పవన్..’ అంటూ టీడీపీ సభ్యులు హేళన చేశారు. అక్కడితో ఆగకుండా చిరంజీవి , పవన్ పోస్టర్లను చించేశారు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ప్రతిదాడికి పాల్పడబోయారు.  గొడవ తీవ్రంగా మారడంతో ఈవెంట్‌ మేనేజర్లు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పే యత‍్నం చేశారు. ఈ క్రమంలో.. వాళ్లపై కేసీ చేకూరి పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఈవెంట్‌ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించగా.. కేసీ చేకూరిని అరెస్ట్‌ చేసి డల్లాస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణ సంగతి తెలిసిన టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం.  కేసీ చేకూరి బెయిల్‌ కోసం తానా పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు