విజయవంతంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ మెంబర్స్ మీట్ అండ్‌ గ్రీట్

26 Sep, 2022 14:58 IST|Sakshi

తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) (TCSS) కార్యవర్గం సొసైటీ  సభ్యులతో  ఆత్మీయ విందు సమావేశాన్ని ఈ నెల 25 సెప్టెంబర్ న స్థానిక లిటిల్ ఇండియా లో ఉన్న ద్వారకా  రెస్టారెంట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 60 మంది TCSS జీవిత కాల సభ్యులు హాజరయ్యారు.

సొసైటి సభ్యులు మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొన్నందుకు సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క సభ్యుడి సలహాలు TCSS అభివృద్ధి ఎంతో ఉపయోగ కరమైనవని, వాటన్నింటిని అమలు చేయడానికి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామన్నారు. రాబోయే బతుకమ్మ సంబురాలకు సంబంధించిన కరపత్రిక, ప్రోమో ను సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా స్థానిక సంబవాంగ్ పార్క్ లో అక్టోబర్ 1 వ తేదీన జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సారి విడుదల చేసిన ప్రోమో ఎంతో ప్రత్యకమైనదిగా చెప్పారు. ఎందుకంటే పూర్తిగా  తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు ప్రత్యకంగా రాసి పాడించారని అన్నారు.  ఈ పాటను రచించి సాహిత్యం అందజేసిన కాసర్ల శ్రీనివాస రావుని సభ్యులందరూ అభినందించారు. 

ఈ సమావేశంలో  అధ్యక్షులు  నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబుతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న సభ్యులకు దాతలకు, ప్రతి ఒక్కరికి  పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు ఇతర సభ్యులు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారం అందజేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు.

మరిన్ని వార్తలు