అబుదాబిలో తెలంగాణ దినోత్సవ వేడుకలు

17 Sep, 2022 22:36 IST|Sakshi

సాక్షి, రాయికల్‌: అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రాజ శ్రీనివాస్‌రావు, వంశీక్రిష్ణ, గంగారెడ్డి, గోపాల్, సన్ని, సంతోష్, బాబు, జగదీశ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, చరణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు