కెనడాలో ‘తాకా’ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

7 Apr, 2022 22:08 IST|Sakshi

కెనడా లో తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్ వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1200 మందికి పైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రేణు కుందెమ్, అనిత సజ్జ, ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. తాకా అధ్యక్షులు కల్పనా మోటూరితోపాటు రంజిత హంసాల, రజిని లయం, గీత దేసు, వీణ మార్పిన జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాలను ప్రారంభించారు. 

అనంతరం కెనడా -భారత దేశ జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి టొరంటో ఇండియన్ కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేశారు.. అపూర్వ ‘తాకా’ విశిష్టత గురించి , టొరంటోలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, తాకా కార్య వర్గ సంఘం సభ్యులు అపూర్వ శ్రీవాస్తవను సత్కరించారు.

అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన ధాత గెట్ హోమ్ రియాల్టీ రమేష్ గొల్లు , ఆనంద్ పేరిచర్ల ను సత్కరించారు. వారికి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా తాకా కార్యవర్గం తాకా ప్రధాన వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి కమ్యూనిటీకి చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలని ఎంతగానో ప్రశంసించి చిరు సత్కారంతో గౌరవించారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ తాకా చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా గత రెండు సంవత్సరాలలో జరిపించిన కార్యక్రమాలను వివరించారు.

టొరంటో లో ఉన్న తెలుగు పూజారి మంజునాథ సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణం గావించారు. ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. 130 కి పైగా చిన్నారులు పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక.. చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పాడిన గీతాలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ ,  బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక,  ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన  అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్చంధ కార్యకర్తలకు తాకా కార్యవర్గం ధన్య వాదాలు తెలిపింది.. చివరిగా తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, అరుణ్ లయం, తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిధులకు ధన్యవాదాలను తెలిపారు. 

చదవండి: భారతీయులకు స్వాగతం.. ఛాయ్‌ సమోసా అన్నీ సిద్ధం

మరిన్ని వార్తలు