-

మహాత్ముడికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నివాళులు

1 Feb, 2021 19:11 IST|Sakshi

టెక్సాస్‌: జనవరి 30న జాతిపిత గాంధీజీ వర్ధంతి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడాయన. 20వ శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడారు. చేతిలో కర్ర పట్టుకుని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు, సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్‌) సభ్యులందరి తరపున టాంటెక్స్ అద్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి జొన్నల స్థానికంగా జాఫర్ సన్ పార్క్‌, అర్వింగ్‌లోని మహాత్ముడి విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (చదవండి: సాగువీరుడా ! సాహిత్యాభివందనం)

మరిన్ని వార్తలు