వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు

25 Aug, 2021 17:18 IST|Sakshi

సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ,  వీధి అరుగు వారి అధ్వర్యంలో ఆగస్టు 28, 29 తేదిల్లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా  సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని గౌరవించేందుకు  ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందజేస్తున్నారు.  

ఈ మేరకు ఎంట్రీలను ఆగస్టు 10 వరకు ఎంట్రీలకు స్వీకరించారు. జ్యూరీ సభ్యులు విక్రం పెట్లూరు,  వెంకట్ తరిగోపుల, లక్ష్మణ్,  తొట్టెంపూడి గణేశ్‌లు ఎంట్రీలను పరిశీలించి  తెలుగు సాహిత్యం కోసం పాటుపడిన 12 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. వీరికి తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే వాటిని ప్రదానం చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు