వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

29 Aug, 2021 15:11 IST|Sakshi

దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు- నార్వేలు సంయుక్తంగా వర్చువల్‌ పద్దతిలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ప్రముఖ రచయిత్రి మంగిపూడి రాధికకు  ప్రవాస తెలుగు పురస్కారం ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా రచయిత తనికెళ్ళ భరణి  ఈ పురస్కారాన్ని అందుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి అభినందనలు తెలియజేశారు. మొత్తం 12 మంది ప్రవాస భాషా సేవకుల కృషిని తెలియజేశారు. ప్రవాస భాషా సేవకులు చేస్తున్న కృషిని ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, డాక్టర్ మీగడ రామలింగస్వామిలు ప్రశంసించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారు ముఖ్యఅతిథిగా ప్రారంభోపన్యాసం చేసి ఈ సభను ప్రారంభించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణ గావిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విక్రమ్ పెట్లూరు దక్షిణాఫ్రికా, డాక్టర్ వెంకట్ తరిగోపుల నార్వే, సుధాకర్ కువైట్, లక్ష్మణ్ దక్షిణాఫ్రికా, రత్నకుమార్ కవుటూరు సింగపూర్ , పీసపాటి జయ హాంకాంగ్ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి

మరిన్ని వార్తలు