సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు

25 Aug, 2021 16:31 IST|Sakshi

కెనడా ప్రధాన కేంద్రంగా టొరంటోలో జరుగుతున్న మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు ,  12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుa నిర్వహాణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.  2021 సెప్టెంబరు 25, 26 తేదిల్లో వర్చువల్‌గా ఈ సదస్సు జరుగుతుందని కెనడా తెలుగు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. కెనడాలో ఉన్న ఎనిమిది తెలుగు సంఘాలు సంయక్తంగా ఈ సాహితి సదస్సును నిర్వహిస్తున్నాయి.

ఈ సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వందకు పైగా ఎంట్రీలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. వీరందరికి అవకాశం కలిగించడానికి సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time)  మొత్తం 20 గంటలకి పైగా ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు
 

చదవండి :డెట్రాయిట్‌లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు సమావేశం

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు