దీపావళి వేడుకల్లో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ దంపతులు

5 Nov, 2021 14:05 IST|Sakshi

డల్లాస్, టెక్సాస్: ప్రవాస భారతీయులతో కలిసి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన సతీమణి సిస్లియాతో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో త్సాహంగా పండుగ జరుపుకున్నారు. దీపావళి సంకేతంగా పలు దీపాలను గవర్నర్‌ దంపతులు వెలిగించార. అందరికీ విందుభోజనం తో పాటు మిటాయిలు పంచారు.  

మరిచిపోలేని అనుభూతి
ఈ సందర్భంగా గవర్నర్ అబ్బాట్ మాట్లాడుతూ.. అమెరికా దేశ ప్రగతిలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్ర పురోభివృద్ధికి వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్య సామాన్యం అన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం తనకొక ఒక ప్రత్యేక అనుభూతి పంచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.  భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య ఇప్పటికే గణనీయమైన వాణిజ్య సంభందాలున్నాయని, భవిష్యత్తులో అవి ఇంకా పెరుగుతాయనే నమ్మకం ఉందన్నారు. 

కృతజ్ఞతలు
భారత్‌, టెక్సాస్ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక, వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు గవర్నర్ చేస్తున్న కృషి అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్‌ అగర్వాల్‌ అన్నారు. అధికారిక నివాస గృహంలో ప్రవాస భారతీయల మధ్య దీపావళి పండుగ జరుపుకున్న గవర్నర్‌ అబ్బాట్‌ దంపతులకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ వేడుకల్లో మురళి వెన్నం, సుధాకర్ పేరం, వినోద్ ఉప్పు, సంజయ్ సింఘానియా, డాక్టర్‌ గూడూరు రమణా రెడ్డి, గొట్టిపాటి వెంకట్, సునీల్ రెడ్డి, వెంకట్ మేడిచెర్ల, బంగారు రెడ్డి, సునీల్ మైని, ఏకే మాగో, పియూష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.                      
 

మరిన్ని వార్తలు