వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు

12 May, 2021 20:27 IST|Sakshi

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటి చెప్పిన నా పార్టీ నాయకులకు, సహచరులకు వందనాలు. మానవీయతా కోణంలో పాలన అందిస్తున్న జగనన్నే స్ఫూర్తిగా.. ఈ కష్టకాలంలో వెలకట్టలేని సాయాన్ని అందిస్తూ వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు అని రత్నాకర్‌ పండుగాయల, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) అన్నారు. అభివృద్ధిలో అందళం ఎక్కిన అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా ఈ కరోనా తాకిడికి అతలాకుతం అయింది చూస్తున్నాం. ఈ మహమ్మారి విజృంభించి ప్రాణాలు బలితీసుకుంటున్న వేళ, మన అనుకున్న వాళ్ళే కనుమరుగు అవుతున్న వేళ.. మనపై నమ్మకంతో మన సహాయాన్ని కోరుతున్న ప్రతీ ఒక్కరికీ మన శక్తి మేరకు సహాయం చేయడం ఈ సంక్షోభ సమయంలో సాటిమనిషిగా మన కర్తవ్యం అని రత్నాకర్ అన్నారు. 

ఈ అత్యవసర సమయంలో అర్ధరాత్రి, అపరాత్రి అని ఆలోచించకుండా, క్షణం ఆలస్యం చేయకుండా ఎంతో మంది స్పందించారు. వైద్యసహాయం కోసం అమెరికా నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించిన తక్షణమే వెంటనే సహయం చేశారు. శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు మన పార్టీ నాయకులకు, మంత్రులుకు వారి కార్యాలయ సిబ్బంది, ఎంపీలు,ఎమ్మెల్యేలు వారి సహాయ అధికారులు తమ శక్తికి మించి సహాయం చేసి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం/ ఆరోగ్య శ్రీ అధికారులు, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారిని/పార్టీని అభిమానించే డాక్టర్లు అందరూ తమ వంతుగా ఈ ఆపద సమయంలో సహాయ సహకారాలు అందించారు. ఆక్సీజన్, ఆస్పత్రి బెడ్ కావాలన్నా అనూహ్యంగా కన్ను మూసిన వారికి అంత్యక్రియలు జరగాలన్న.. అన్నీ విధాలుగా సహకరించిన పార్టీ శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

జగన్ అన్న ప్రభుత్వంలో, మన పార్టీ లో ఓక భాగస్వామి అయినందుకు, మీ అందరితో కలిసి పని చేసే అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తూ ఎంతో గర్వ పడుతున్నాను. మీరు చేస్తున్న సాయం ఒకరి జీవితాన్ని నిలబెట్టడం కాదు.. ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుతుంది. ఈ ఆపత్కాలంలో నలుగురికీ సాయం చేయాలన్న మీ మనసు, మీ సేవాగుణం, మీ సహకారం ఎన్నటికీ మరువలేనివి, ఎవరూ మర్చిపోలేనివి మీ సాయం వల్ల నిలబడుతున్న జీవితాలే మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆశీస్సులు అందిస్తున్నాయి. ఈ ఆశీస్సులు ఎప్పటికీ మీకు, మీ కుటుంబానికి ఉంటాయని, ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు