డా. గురుమూర్తితో ప్రపంచ ప్రవాసాంధ్రుల ముఖాముఖి

6 Apr, 2021 11:12 IST|Sakshi

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తితో వైస్సార్‌సీపీ అభిమానులు, తెలుగు వారు శనివారం (ఏప్రిల్ 3న) జూమ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా ‘మీట్ & గ్రీట్’  కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్‌సీపీ అమెరికా ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి అనేకమంది అభిమానులు, ఎన్నారైలు పాల్గొని గురుమూర్తి గెలుపు, తిరుపతి అభివృద్ధికి మలుపు’ అని నినాదించారు. వైస్సార్సీపీ అమెరికా కన్వీనర్ డా. వాసుదేవ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తిని అందరికి పరిచయంతో చేయడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తుందని అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ ప్ర‌భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీకే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఉన్నారన్నారు.

గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ ప్రముఖ ఎన్నారై కేవీ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రంలో వైఎస్సార్సీపీ అమెరికా కన్వీనర్లు డా. వాసుదేవ రెడ్డి, డా. శ్రీధర్ కొరసపాటి, చంద్రహాస్ పెద్ధమల్లు,  నార్త్ అమెరికా సలహాదారు & గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ వల్లూరు రమేష్ రెడ్డి, డా. ప్రభాకర్ రెడ్డి , డా. పవన్ పాముదుర్తి , సుబ్బా రెడ్డి చింతగుంట, శ్రీధర్ నాగిరెడ్డి,  రమణారెడ్డి దేవులపల్లి, డా. రామిరెడ్డి కేసరి,  మెదలగు వారు మాట్లాడుతూ.. రాజకీయాలు అంటేనే డబ్బు, అంగ, అర్ధ బలం తప్పనిసరైన ఈ రోజుల్లో ఒక సామాన్య రైతు బిడ్డ, విద్యావంతుడు, యువకుడు అయిన డా. గురుమూర్తిని తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలలో  నిలబెట్టడం నిజంగా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మహోన్నత వ్యక్తిత్వానికి, పేద బడుగు, బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనము అని తెలిపారు .

భారత రాజ్యాంగంకు నిజమైన నిర్వచనం ఇచ్చే విధంగా వైఎస్సార్ కుటుంబం ఎప్పుడు పేద బడుగు, బలహీన వర్గాల అభివృధి కోసం పరితపిస్తారు అని, ఇచ్చిన మాట, విశ్వసనీయత కోసం వారి ప్రతి చర్య, మాట ఉంటాయని తెలిపారు. డా. గురుమూర్తి గెలుపు కోసం ఎన్నారై కమిటీ కార్యాచరణ రూపొందించుకొని ‘మినిట్ టు మినిట్’  రూపంలో పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి డాక్టర్‌ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను తమ మూలాల ద్వారా అందరిని అభ్యర్థిస్తామని తెలిపారు.

డా. గురుమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మహోన్నత వ్యక్తిత్వానికి తనలాంటి ఒక్క సామన్య యువకుడికి  టికెట్ ఇవ్వడం ఒక్క ఉదాహరణ అని, పార్టీ పెద్దలు, వైస్సార్ అభిమానులు, కార్యకర్తలు, తిరుపతి ప్రజల ఆశీర్వాదంతో ఉప ఎన్నికలలో ప్రజల ముందుకు వస్తున్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులు సహాయసహకారాలు అందించాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకమైన నాయకుడని ఉప ఎన్నిక ద్వారా దేశానికి తెలియచెబుతామని ప్రజలే అంటున్నారన్నారు. సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే రాష్ట్ర ప్రజానీకమంతా ఉందని, 22 నెలల పాలనలోనే దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరుప్రతిష్టలు పొందారని అన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలలలోనే కాకుండా, తరువాత తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రవాసాంధ్రుల ఐటీ, ఐటీ ఆధారిత ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వైస్సార్సీపీ అమెరికా కమిటీ మెంబెర్స్ రమణారెడ్డి క్రిస్టపట్టి, కృష్ణ కోడూరు, పరమేశ్వర రెడ్డి, సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిబొట్ల, జగన్ యాడికి, దుశ్యంత్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డివారి, పవన్, విష్ణు, నరసింహ యాదవ్, నరేంద్ర బుచ్చిరెడ్డి గారి, కృష్ణ చైతన్య (న్యూజిలాండ్), సుబ్బారెడ్డి బొర్రా, అనిల్ రెడ్డి, వాసు మొదలుగు వారు మాటాడుతూ.. సామన్య యువకుడికి టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్‌‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి.. సంక్షేమ పాలనకు మరింత బలాన్ని చేర్చాలని, వారి గెలుపుకు సమిష్టిగా ప్రవాసాంధ్రులు కృషి చేస్తారని ముక్తకంఠంతో  ప్రతిన బూనారు. భారీ మెజారిటీతో గెలవబోతున్న గురుమూర్తికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు