తెలంగాణ పీపుల్స్ అసోసియేష‌న్ ఆఫ్ డ‌ల్లాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

9 Nov, 2022 16:58 IST|Sakshi

డాలస్‌: తెలంగాణ పీపుల్స్ అసోసియేష‌న్ ఆఫ్ డ‌ల్లాస్(TPAD) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరం విజయవంతమైంది. తాజాగా నిర్వ‌హించిన బ్ల‌డ్ డొనేషన్‌ క్యాంపులో 69 మంది రక్త‌దానం చేశారనీ, 52 యూనిట్ల రక్తాన్ని సేక‌రించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. క‌రోనా మ‌హ‌మ్మారి  త‌ర్వాత ఏడాదికి రెండు సార్లు బ్ల‌డ్ డోనేష‌న్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నట్టు టీప్యాడ్‌ వెల్లడించింది. గత ఎనిమిదేళ్లో  బ్ల‌డ్ డోనేష‌న్ క్యాంపు నిర్వ‌హించ‌డం ఇది ప‌దోసారి అని, తాజాగా సేకరించిన బ్లడ్‌ను కార్ట‌ర్ బ్ల‌డ్ కేర్‌కు అందించిన‌ట్లు  తెలిపింది. 

రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారు‌తోపాటు వలంటీర్లకు, కార్ట‌ర్ బ్ల‌డ్ కేర్‌ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహ‌కులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్‌సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు.


ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి డ్రైవ్‌లో 53 రిజిస్ట్రేషన్లు జరగ్గా, తాజాగా 69 మంది రిజిస్ట్రేషన్లతో రోజంతా జరిగిన రక్తదానంలో దాతలు రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు.  అయితే సమయాభావం వల్ల చాలా మంది దాతలు రక్తదానం చేయలేకపోయారని నిర్వాహకులుతెలిపారు. ఈ డ్రైవ్‌లో సేక‌రించిన 52 యూనిట్ల ర‌క్తంతో దాదాపు 10 మందికి గుండె శ‌స్త్ర చికిత్సలు నిర్వ‌హించేందుకు లేదా, 17 మందికి ర‌క్త మార్పిడి లాంటి ఇతర అవసరాలకు స‌రిపోతుంద‌న్నారు.  ఈ సందర్భంగా ర‌క్త‌దానం చేసినవారికి భోజ‌న ఏర్పాట్లు చేశారు.  కార్యక్రమానికి సహకరించిన అభినందించి బ్లాంకెట్ల‌ను బహుమ‌తిగా అంద‌జేశారు.


 

మరిన్ని వార్తలు