మేరీల్యాండ్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి

8 Sep, 2020 19:42 IST|Sakshi

మేరీలాండ్‌ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఫ్రెడెరిక్ నగరంలో  వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్‌ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి  సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ  ఘనంగా నివాళులు అర్పించారు. 

వైఎస్సార్‌సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ ప‌థకాల‌ను ప్రవేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్రతి పేద‌వాడికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్‌ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ అంటే అందరికి గుర్తుకు వచ్చేది అయన పరిపాలన, పధకాలు, అభివృద్ధి. ఈ మూడు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, సోమశేఖర్ పాటిల్, పూర్ణ శేఖర్ జొన్నల, లక్ష్మి నారాయణ, రామకృష్ణ, శ్రీధర్ వన్నెంరెడ్డి, సాయి జితేంద్ర లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా