న్యూజెర్సీలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్‍ అండ్‍ గ్రీట్‍

7 Mar, 2023 23:14 IST|Sakshi

TTA న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం 

ప్రెసిడెంట్‍ వంశీరెడ్డిని సన్మానించిన TTA న్యూయార్క్ ఛాప్టర్

తెలంగాణ అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ TTA  న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెసిడెంట్‍ వంశీ రెడ్డి మీట్‍ అండ్‍ గ్రీట్‍ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో  టీటీఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వంశీ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

 కమ్యూనిటీ సర్వీసెస్, భవిష్యత్ లక్ష్యాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీటీఏ కన్వెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు వంశీరెడ్డి తెలిపారు. ఇక న్యూయార్క్ చాప్టర్ సభ్యులను ఆయన అభినందించారు. తమకు అండగా ఉంటూ సహాయసహాయకారాలు అందిస్తున్న  ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇక టీటీఏ కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు న్యూయార్క్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం  అవటం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. 
 
 

మరిన్ని వార్తలు