మస్కట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

19 Apr, 2022 19:03 IST|Sakshi

ఒమన్: ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్- తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉగాది వేడుకల్లో 600 మంది భారతీయులు పాల్గొన్నారు.

ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని  కౌనిసలర్ ఇర్షిద్ అహ్మద్  (కారిమక్ & సామాజిక్ సంక్షేమం), ఇండియన్ ఎంబసీ, శుభోదయం గ్రూప్  ఛైర్మన్ లక్ష్మీ ప్రసాద్ క్లపటపు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇర్షిద్ అహ్మద్ తెలుగు కళా సమితి విశిష్టతను, మస్కుట్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని,సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ అనిల్‌ కుమార్‌తో పాటు చిన్నారావు, తవ్వా కుమార్‌, సీతారాం, శ్రీదేవి, చైతు సూరపనేని, చైతన్య, రాజ, చరణ్‌, మూర్తి, శ్రీధర్‌, రాణి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ వేడుకలు కన్నుల పండువగా జరిపేందుకు తమ వంతు కృషి చేశారు.

మరిన్ని వార్తలు