బే ఏరియాలో ఘనంగా సీఎం వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు!

27 Dec, 2022 20:04 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో బే ఏరియా నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్లీసాటన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఎన్‌ఆర్‌ఐలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల అశీసులతో 2024లో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, పేద, బడుగు బలహీన వర్గాలకు మరింత సేవ చేయాలనీ ఆకాక్షించారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లాగానే వారి ఆశయాలను వారి కుమారుడు నేటి సీఎం వైఎస్‌ జగన్ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారు అని కొనియాడారు. ఈ కార్యక్రమములో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ (YSRCP USA NRI) కన్వీనర్ చంద్రహాస్ పెద్దమళ్లు, గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీ రెడ్డి, బే ఏరియా వైఎస్సార్‌సీపీ ముఖ్య సభ్యులు అబ్బవరం సురేంద్ర, ప్రవీణ్ మునుకూరు, శివారెడ్డి, కొండారెడ్డి, కిరణ్ కూచిబొట్ల, ప్రశాంతి, సుగుణ, సురేష్ తనమల,తీరు, వంశీకృష్ణ రెడ్డి, నరేంద్ర కొత్తకోట, వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విభాగం నేతలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు