ఘనంగా వాల్మికీ జయంతి వేడుకలు

26 Oct, 2021 10:40 IST|Sakshi

సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘాలు సంయుక్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. అందులో భాగంగా సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై వర్చువల్‌ సదస్సు నిర్వహించారు. సుమారు 20 దేశాలకు చెందిన వారు ఈ వేడుకల్లో భాగమయ్యారు. 

సమాజ శ్రేయస్సు కొరకు ఉచితంగా నిర్వహించిన ఈ దీక్షా కార్యక్రమానికి  తితిదే ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రామాయణం మానవాళికి మార్గనిర్దేశనమన్నారు. త్రేతాయుగం నాటి రామాయణాన్ని నేడు ప్రతి ఒక్కరూ అనుసరించేలా మహర్షి వాల్మీకి  రచించారని చెప్పారు. విశిష్టఅతిధిగా హాజరైన ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణమే మానవ జీవన పారాయణమన్నారను. భారతీయ సనాతధర్మం విశిష్టతను రామయణం ద్వారా వాల్మీకి మహర్షి జాతికి తెలియజేశారన్నారు. 
 

మరిన్ని వార్తలు