వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ

2 Apr, 2022 19:09 IST|Sakshi

ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి

ఉత్తమ కథానిక విభాగం విజేతలు
1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్‌న్‌, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత  (మోర్గాన్‌హిల్‌, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్‌ వాషింగ్టన్‌, డీసీ, ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్‌బర్గ్‌, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్‌, మిచిగాన్‌, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్‌, ఐర్లాండ్‌  ప్రశంసా పత్రం)  4)  “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్‌, న్యూజీలాండ్‌, ప్రశంసా పత్రం) 
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్‌, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్‌ట్రీ, యూఎస్‌ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం
"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం  (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్‌) ప్రశంసా పత్రం
 

మరిన్ని వార్తలు