ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!!

5 Feb, 2022 17:34 IST|Sakshi

అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తాడు? ఆస్తులెన్ని ఉన్నాయి? కుటుంబ నేపథ్యం ఏంటీ ? అతని గుణగణాలు.. ఇవన్నీ అక్కడ జాన్తా నహీ అక్కడ. అమెరికా వెళ్లే అవకాశం అబ్బాయికి ఉందా ? కనీసం అతని బంధువులైనా కెనడా, యూస్‌లో ఉంటున్నారా ? ఇవే ఇప్పుడు పెళ్లికి ప్రతిపాదికగా మారాయి. కొత్తగా వచ్చిన ఈ ట్రెండ్‌తో గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. 

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ దాని పక్కనే ఉన్న మెహ్‌సానా జిల్లాలలో ఎన్నారై క్రేజ్‌ పీక్స్‌కి చేరుకుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఎన్నారై హోదా ఉన్న అబ్బాయికే తమ అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టాలని డిసైడ్‌ అయ్యారు.  ఈ జిల్లాలో ప్రముఖంగా ఉన్న కొన్ని సమాజిక వర్గాల్లో ఈ విష ధోరణి ఎక్కువగా ఉంది. లీగల్‌గానో ఇల్లీగల్‌గానో అమెరికా లేదా కెనడా వెళ్లగలిగే అబ్బాయిలకే ఇక్కడ పెళ్లిల్లు అవుతున్నాయి. చివరకి వేలు విడిచిన చుట్టమైనా విదేశాల్లో ఉంటేనే కనీసం పెళ్లి చూపుల వరకైనా పిలుస్తున్నారు. లేదంటే అంతే సంగతులు అన్నట్టుగా మారింది పరిస్థితి.

మరోవైపు ఎన్నారై అమ్మాయిలకు పాటిదార్‌ సమాజ్‌లో ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. ఎన్నారై అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఎదురు కట్నం ఇచ్చేందుకు ఇక్కడ కుటుంబాలు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు రూ. 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎన్నారై యువతులకు ఎదురు కట్నంగా ఇచ్చేందుకు చాలా మంది అబ్బాయిలు రెడీ ఉన్నారు. ఇటీవల అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో కెనాడా సరిహద్దులు దాటుతూ ఓ కుటుంబం చనిపోయిన ఘటనతో ఈ ఎన్నారై పిచ్చి గురించి బయటి ప్రపంచానికి తెలుస్తోంది. 

చదవండి:చలికి తాళలేక అమెరికా సరిహద్దులో చనిపోయిన నలుగురు భారతీయులు

మరిన్ని వార్తలు