కాలిఫోర్నియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

28 Oct, 2020 20:56 IST|Sakshi

కాలిఫోర్నియా : మహిళల కొరకు ఉత్తర అమెరికాలో  తెలుగు మహిళల స్త్రీ ప్రగతి, అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)బతుకమ్మ, విజయ దశమి సందర్బంగా సమావేశమై సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్నికాలిఫోర్నియాలోని సాన్ హోసే నగరంలో నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో శనివారం జరిగాయి. 

మహిళకు  అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి వారి కళలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని  ఝాన్సీ రెడ్డి గారు మరొకసారి గుర్తు చేసారు. ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్‌, ప్రెసిడెంట్‌ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు.


  
ప్రెసిడెంట్ ఎలెక్ట్ "శైలజ కల్లూరి"  మాట్లాడుతూ  ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో  తక్కువ మంది తో, సామజిక దూరాన్ని పాటిస్తూ , మాస్కులు ధరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటూ ఈ వేడుక జరుపుకొంటున్నామన్నారు.  బతుకమ్మ , దసరా పండుగలు మన సంస్కృతికి చిహ్నంగా జరుపుకొంటున్నామన్నారు. సంస్కృతి సంప్రదాయాలను మనం ఇప్పటి తరం యువతీ యువకులకు, పిల్లలకు నేర్పించినట్లయితేనే మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లగలమని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్  ముఖ్య సభ్యులు సుగుణరెడ్డి,అనురాధ ఎలిశెట్టి, హైమ అనుమాండ్ల, లక్షి అనుమాండ్ల, పూజ లక్కడి, చిన్మయి ఎరుకల, యశస్వినీ రెడ్డి, జ్యోతి పెంటపర్తి, ప్రశాంతి కూచిబొట్ల కూడా  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు