ప్రవాసాంధ్రుల ఔదార్యం, కోవిడ్‌ కేర్‌ కిట్లు పంపిణీ

15 Jul, 2021 13:13 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కోవిడ్​  సంబంధిత ఔషధాలు, మెడికల్​ ఎక్విప్​మెంట్​ను  విమెన్​  ఎంపవర్​మెంట్​ తెలుగు అసోసియేషన్​ డోనేట్​ చేసింది. కాలిఫోర్నియాలోని హన్​ఫోర్డ్​ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ  గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి పాటుపడుతోంది.  కోవిడ్​ సెకండ్​ డ్రైవ్​లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల వెటా ఆధ్వర్యంలో మందులు, మెడికల్​ ఎక్విప్​మెంట్​  అందచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ ఫార్మసీల నుంచి  విరాళాలు సేకరించి వాటిని  రెండు తెలుగు రాష్ట్రాల్లోని  గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ  చేశారు. 

సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో పలు గ్రామాలకు రూ. 1. 50 లక్షల విలువైన  యాంటీ బయాటిక్స్,  సీ విటమిన్​  ట్యాబెట్లు,  సిరంజీలు డోనేట్​ చేశారు. ఖమ్మం జిల్లా పల్లేరు  గ్రామంలో ఐసోలేషన్​ వార్డుకి  ఫేస్ షీల్డ్స్, హెడ్ క్యాప్స్, ఆక్సిమీటర్లు, ఐఆర్ థర్మామీటర్లు అందించారు. ఇదే జిల్లాలో  కూసుమంచి ఆరోగ్య కేంద్రానికి 7 పీపీఈ కిట్​ గౌన్లలను అందించారు. సూర్యాపేట  జిల్లాలోని పలు పాఠశాలలకు  ఆక్సిమీటర్లు, ఇర్​  థర్మామీటర్లను పంపిణీ చేయడంతో పాటు కృష్ణా జిల్లాలో 75 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిమీటర్లు మరియు డిజిటల్ థర్మామీటర్లను పంపిణీ చేశారు. దీంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రికి రూ. 1.5 లక్షల విలువైన పల్స్ ఆక్సిమీటర్లు, కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్లు, ఇర్ థర్మామీటర్లు,  ఫేస్ షీల్డ్స్,  పీపీఈ కిట్లు,  హెడ్ క్యాప్స్, రేణిగుంటలోని  అభయ క్షేత్రం అనాథ ఆశ్రమానికి ఒక నెలకు సరిపడా సామాన్లు, ప్రాజెక్ట్​ ఆశ్రయ్​కి 15 ఆక్సిజన్​ కాన్​సన్​ట్రేటర్లు వెటా ద్వారా అందించారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు