ఏప్రిల్‌ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం

31 Mar, 2021 22:37 IST|Sakshi

ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం‌ ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు.

కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్‌ చైర్మన్‌), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్‌ కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌ రెడ్డి, ఈనాడు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సబ్‌ఎడిటర్‌ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, మనతెలంగాణ ఎడిటోరియల్‌ అడ్వైజర్‌ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు