మెంఫిస్‌లో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

11 Jul, 2021 07:41 IST|Sakshi

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. మెంఫిస్‌(టెన్నెస్సీ స్టేట్‌) నగరంలో వైఎస్సార్‌ అభిమానులు, దివంగత ముఖ్యమంత్రి.. మహానేత వైఎస్సార్‌ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 

రైతు దినోత్సవం సందర్భంగా సమైక్యాంధ్రలో ఆ మహానేత చేపట్టిన ప్రజారంజక సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తండ్రి బాటలో పయనిస్తూ.. ఆ మహానేత వారసుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్న​ప్రజా ప్రయోజన పథకాల సత్ఫలితాల గురించి చర్చించుకున్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో స్థానిక కార్యనిర్వాహక నాయకులు రాజశేఖర్‌రెడ్డి, భద్రం నరిశెట్టి, జైపాల్‌రెడ్డి బుడ్డాల, వీరమోహన్‌రెడ్డి, రమేష్‌, రాహుల్‌రెడ్డి గౌరవరం, అలీ సయ్యద్‌, నాగిరెడ్డి, హరి, మధుకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నీలోత్పల్‌ రెడ్డి, సూర్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు