YSR Birthday Celebrations: అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు!

10 Jul, 2022 14:00 IST|Sakshi

అమెరికాలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు


 
నార్త్ వెస్ట్ అమెరికా సియాటెల్‌లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకల్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిమానులు  వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన వంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.  

ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువీన్ రెడ్డి, చెన్నా రెడ్డి, మహీధర్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు,జేసి రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, దామోదర్, రామ్, లోకనాథ్, శేఖర్ గుప్త విన్నకోట, భాస్కర్ రావికంటి, ఆళ్ళ రామిరెడ్డిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు