అమెరికా అంతటా వైఎస్‌ఆర్‌ జయంతి ఉత్సవాలు

6 Jul, 2021 18:26 IST|Sakshi

వాషింగ్టన్‌: దివంగత మాజీ ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అమెరికాలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) వేడుక కార్యక్రమాలను నిర్వహించనుంది. డాక్టర్ వైయస్ఆర్ అభిమానుల సహాయంతో అమెరికాలోని వివిధ నగరాలు కాలిఫోర్నియా, కనెక్టికట్, డెలావేర్, ఫ్లోరిడా, జార్జియా,ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మిన్నెసోటా, మిస్సౌరీ, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియా, టెక్సాస్, వర్జీనియా, వాషింగ్టన్ లో వైఎస్‌ఆర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించనుంది.

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ జయంతి ఉత్సవాలను జరుపనున్నారు. అమెరికాలో వైఎస్‌ఆర్ అనుచరులు జూలై 8 గురువారం వైఎస్ఆర్ జయంతిని  జరుపుకోనున్నారు. జూలై 10, జూలై 11న ముఖ్యమైన కార్యక్రమాలు జరగుతాయని ఫౌండేషన్‌ నిర్వహకులు తెలిపారు.ఈ సేవ కార్యక్రమాల్లో వైఎస్‌ఆర్‌ అనుచరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ జయంతి ఉత్సవాలు జరిగే నగరాలు

  • సీటెల్ (వాషింగ్టన్) జూలై 9, 2021 (శుక్రవారం), 
  • లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా),కనెక్టికట్, డెలావేర్, వర్జీనియా, డల్లాస్ (టెక్సాస్) జూలై 10, 2021 (శనివారం)
  • శాన్ జోస్ (కాలిఫోర్నియా), అట్లాంటా (జార్జియా), చికాగో (ఇల్లినాయిస్), మేరీల్యాండ్, మిన్నియాపాలిస్ (మిన్నెసోటా), సెయింట్ లూయిస్ (మిస్సౌరీ), న్యూజెర్సీ, షార్లెట్ (నార్త్ కరోలినా), రాలీ (నార్త్ కరోలినా), కొలంబస్ (ఒహియో), ఆస్టిన్ (టెక్సాస్), హ్యూస్టన్ (టెక్సాస్) జూలై 11(ఆదివారం)


గతంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) పలు కార్యక్రమాలను చేపట్టింది. కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్‌ రిలీఫ్‌ ఈవెంట్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ కాన్సన్‌టేటర్లు, మెడికల్‌ కిట్లు, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు సహాయం చేయడం, కోవిడ్‌ రోగులకు ఆహారాన్ని పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి సమయంలో నిధుల కొరతతో బాధపడుతున్న  అనాథాశ్రమాలకు సహాయం చేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాకారంతో ఫౌండేషన్‌ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా ప్యూరిఫైడ్‌ వాటర్ ప్లాంట్లను, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి డాలర్ టూ డాలర్ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతమైంది. ఫౌండేషన్‌కు విరాళాలు అందించిన వారికి కృతజ్ఙతలు తెలిపారు.

మరిన్ని వార్తలు