పెన్సిల్వేనియా లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

12 Jul, 2021 22:18 IST|Sakshi

పెన్సిల్వేనియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని  పెన్సిల్వేనియా రాష్ట్రము లో హ్యర్రీస్ బర్గ్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని పెన్సిల్వేనియాలో హ్యర్రీస్ బర్గ్ నగరం లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు,  వైఎస్సార్‌ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్ఆర్‌సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్‌,  ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్  సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ అధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు.


 వైఎస్ఆర్‌సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్‌,  ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్  సాత్విక్ రెడ్డి గోగులమూడి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో  వైఎస్సార్‌ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. 

హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్‌  వైఎస్సార్‌ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ తపనతో ఉందన్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా  వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అమెరికా స్టూడెంట్ కన్వీనర్ పెన్సిల్వేనియా రీజనల్ ఇంఛార్జ్‌,  ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్  సాత్విక్ రెడ్డి గోగులమూడి, హ్యర్రీస్ బర్గ్ ఇంచార్జి తేజ, మల్లికార్జున రెడ్డి కసిరెడ్డి , విభూషణ్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, వాకా కృష్ణ, రవీందర్ రెడ్డి శీలం, రాజేష్ ఊతకోళ్ళు , వెంక రెడ్డి సుంకర , ప్రకాష్ మిరియాల, వెంకట్ దంగేటి, అన్వేష్ ముత్యాల, సుజీత్ అనుగు లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు