వైఎస్సార్‌ సీపీ భారత్‌‌ను ఏపీ వైపు చూసేలా చేసింది

15 Mar, 2021 20:27 IST|Sakshi

కువైట్:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం కువైట్‌లో పండుగలా జరిగింది. ఈ సందర్భంగా సాల్మియా ప్రాంతంతో కువైట్‌ వైఎస్సార్ సీపీ భారీ కేక్‌ను కట్‌ చేసింది. కువైట్‌ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ( ఇండియా సమయం రాత్రి 10.30 గంటలకు ) నిర్వహించారు. ఈ సందర్భముగా కువైట్ వైఎస్సార్‌ సీపీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన తండ్రి  దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌ తండ్రికన్నా రెండడుగులు ముందుకేసి అన్ని వర్గాల ప్రజలకు కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కువైట్‌ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, వర్కింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయములో ఇచ్చిన వాగ్దానాలలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 90 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎన్‌ఆర్‌టీసీ రీజనల్ కో ఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి ,  వైఎస్సార్‌ సీపీ కువైట్ సలహాదారుడు  నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇంచార్జి మర్రి కళ్యాణ్, బి.సీ.ఇంచార్జి రమణ యాదవ్. మీడియా ఇంచార్జి పుల్లపూత్తురు సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు రహమతుల్లా,హనుమంత్ రెడ్డి, పోలూరు ప్రభాకర్, లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు