నెమలి వేణుగోపాలునికి భక్తిశ్రద్ధలతో చక్రస్నానం

10 Mar, 2023 01:42 IST|Sakshi
నెమలిలో వేణుగోపాలస్వామికి చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు

నెమలి(గంపలగూడెం): నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ వేణుగోపాలస్వామికి చక్రస్నానం నిర్వహించారు. నిత్యహోమం, బలిహరణ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వధూవరులైన శ్రీ వేణుగోపాలస్వామి సత్యభామ రుక్మిణీదేవిల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి మేళతాళలతో నిర్వహించిన గ్రామోత్సవం కనులపండువగా జరిగింది. గురువారం రాత్రి తెప్పోత్సవం కనుల విందుగా జరిగింది. బ్రహ్మోత్సవ వేడుకల్లో మొట్టమొదటిసారిగా ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రాంగణంలోని కోనేరులో ప్రత్యేకంగా అలంకరించిన పడవలో వధూవరులైన దేవతామూర్తులు శ్రీ వేణుగోపాలస్వామి, రుక్మిణీదేవి సత్యభామల ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా తిలకించారు.

ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ కావూరి శశిరేఖ, పాలకవర్గ సభ్యులు నాగలక్ష్మణరావు, వెంకటకృష్ణ, రాధాకృష్ణ, వీర ప్రసాద్‌, నరసింహారావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు