వైద్య చికిత్సకు ఎమ్మెల్యే రూ. 50 వేలు సాయం

18 Mar, 2023 00:46 IST|Sakshi
నగదును అందజేస్తున్న ఎంపీపీ, జెడ్పీటీసీలు

గన్నవరం: మధుమేహ వ్యాధితో బాధపడుతున్న విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడుకు చెందిన కొమరవల్లి ఆశీర్వాదం వైద్య చికిత్సకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశారు. శాసనసభ్యుని కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వాదం కుటుంబ సభ్యులకు నగదును ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సభ్యులు కాకర్లమూడి సువర్ణరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మధుమేహ వ్యాధి వల్ల ఆశీర్వాదం కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎమ్మెల్యే వంశీమోహన్‌ దృష్టికి తీసుకురావడంతో ఆయనకు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాలును కొంత భాగం తొలగించడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఆతని వైద్యానికి అయినా పూర్తి ఖర్చును అందజేసినట్లు తెలిపారు. ఎనికేపాడు సర్పంచ్‌ రాచమళ్ళ పూర్ణచంద్రరావు, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్‌రాణి, ఎంపీటీసీలు గంగుల శ్రీనివాసరావు, దూరు రత్నం, పార్టీ నేతలు రామిశెట్టి వెంకటేశ్వరరావు, కోనేరు సుబ్బారావు, సమ్మెట సాంబశివరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు