రక్తహీనత నివారణకు తాటి బెల్లం: కలెక్టర్‌ ఢిల్లీరావు

27 Mar, 2023 01:28 IST|Sakshi

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించడానికి ప్రస్తుతం అందిస్తున్న ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్‌లెట్లకు అదనంగా పాఠశాల విద్యార్థినులకు తాటి బెల్లాన్ని ప్రయోగాత్మకంగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. కౌమార బాలికల్లో రక్తహీనత నివారణపై ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు విద్య, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బెల్లం హైడ్రోజన్‌ సల్ఫర్‌ల మిశ్రమంతో తయారు చేయడంతో బాలికల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. తాటి బెల్లంలో ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండటంతో రక్తహీనతను నివారించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా కస్తూరిభా బాలికల పాఠశాలలో, మోడల్‌ పాఠశాలలో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, విద్య శాఖాధికారి సమన్వయంతో ఎనీమియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రతి వారం తనిఖీలు

ఇకపై గ్రామవార్డు సచివాలయం సిబ్బంది, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు,ఆర్డీఓలు, డీఆర్‌ఓ, జాయింట్‌ కలెక్టర్‌లు పంపిణీ చేసిన ట్యాబులు వినియోగించుకునేలా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

నేటి నుంచి జగ్గయ్యపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో..

fVýSY-Ķæ$Åõ³r Ýë…íœ$MýS çÜ…„óSÐ]l$ Ô>Q »êÍ-MýSÌS Ð]lçÜ-†-VýS–-çßæ…ÌZ ÝùÐ]l$ÐéÆý‡… ¯]l$…_ ™ésìæ »ñæÌSÏ… ç³…í³×îæ ^ólĶæ$yé-°MìS ™H-Æ>µr$Ï ^ólÝë¢-Ð]l$¯]l² hÌêÏ Ýë…íœ$MýS çÜ…„óSÐ]l$ Ô>Q A«¨-M>-Ç×ìæ ÑfĶæ$ ¿êÆý‡-†° MýSÌñæ-MýStÆŠ‡ AÀ-¯]l…-¨…-^éÆý‡$. çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ hÌêÏ OÐðl§ýlÅ BÆø-VýSÅ-Ô>Rê-«¨-M>Ç×ìæ yéMýSt-Æ-Š‡ Ð]l*^èlÆý‡Ï çÜ$àíÜ-°, yîlDK Æó‡×æ$MýS, G‹Ü-G-‹ÜïÜ ï³yîl Ð]l$õßæ-ÔèæÓ-ÆŠ‡-Æ-Š-‡, yîlG^ŒlK »êÌê-i, IïÜ-yîl-G-‹Ü-‹ ï³yîl EÐ]l*§ólÑ ™èl¨™èlÆý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.

>
మరిన్ని వార్తలు